'అఖిల్' కోసం దర్శకుడు వినాయక్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలు నిడివి ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే తరహాలో కాస్త నిడివి ఎక్కువగానే వినాయక్ సైతం సినిమాలు తీశాడు. దాదాపు రెండున్నరగంటలుగా ఆయన చేసిన చిత్రాలు ఉన్నాయి. కానీ 'అఖిల్' సినిమా నిడివిని మాత్రం కేవలం రెండు గంటల పదినిమిషాలకు సరిపుచ్చాడు. షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించాడనే చెప్పాలి. ఈ చిత్రంలో వందశాతం వినోదం గ్యారంటీ అంటున్నాడు వినాయక్. వినాయక్ కెరీర్‌లోనే తక్కువ నిడివి కలిగిన చిత్రంగా 'అఖిల్' నిలుస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ ఎనర్జీ సూపర్బ్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మహేష్, రామ్‌చరణ్, బన్నీ... ఇలా ఏ హీరోమొదటి చిత్రంతో సాధించనటు వంటి ఘనవిజాయాన్ని సాధించి, బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిరూపిస్తుందని అక్కినేని అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.