Advertisementt

సల్మాన్‌ టార్గెట్ ఎంతో తెలుసా?

Mon 09th Nov 2015 10:08 AM
salman khan,prema leela,bhajarangi bhaijan,prem ratan dhan payo,1000 crores  సల్మాన్‌ టార్గెట్ ఎంతో తెలుసా?
సల్మాన్‌ టార్గెట్ ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్స్‌ నటించిన చిత్రాలు హిట్టయితే ఈజీగా 500 ల కోట్లను దాటేస్తున్నాయి. కానీ ఒకే సినిమాతో 1000 కోట్లు సాదించడం మాత్రం ఇప్పట్లో జరిగేపని కాదు. కాగా ఒకే ఏడాదిలో తాను నటించిన చిత్రాలతో 1000కోట్లు సాధించడం మాత్రం సల్మాన్‌ఖాన్‌ వంటి స్టార్‌కు సాధ్యమే అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'భజరంగీ భాయిజాన్‌' చిత్రంతో దాదాపు 600కోట్లను వసూలు చేసిన సల్మాన్‌.. ఇదే ఏడాది తాను చేస్తున్న 'ప్రేమ్‌రతన్‌ పాయో' చిత్రంతో మరో 400కోట్లు సాధిస్తే ఒకే ఏడాది 1000కోట్లు వసూలు చేసిన హీరోగా రికార్డు సృష్టిస్తాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో ఒకేసారి 'ప్రేమలీల'గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ పాత్రకు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. మొత్తానికి ఎలాగైనా మరో 500 కోట్లపై సల్మాన్‌ఖాన్‌ కన్నేశాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది. సినిమా హిట్ టాక్ వస్తే.. సల్మాన్ కి ఇదో పెద్ద విషయమే కాదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ