జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరో నందమూరి కళ్యాణ్‌రామ్. ఈఏడాది ప్రారంభంలో విడుదలైన 'పటాస్' చిత్రంతో పెద్ద విజయం సాధించిన ఆయన ఇటీవల వచ్చిన 'షేర్'తో విజయపరంపర సాగించలేకపోయాడు. 'షేర్' చిత్రం డిజాస్టర్‌గా నిలిచి 'పటాస్'తో వచ్చిన విజయం గాలివాటపు విజయం అనిపించుకొంది. కాగా ఆయన త్వరలో మరో చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' అంటూ హిట్ కొట్టి ఇప్పుడు గోపీచంద్‌తో 'సౌఖ్యం' సినిమా తీస్తోన్న రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ నటించనున్నాడు. పూర్తి ఎంటర్‌టైనర్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్ర ఉంటుంది అని సమాచారం. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. 'షేర్' చిత్రం నిరాశపరచడంతో ఈ సినమా కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.