Advertisementt

ప్రభాస్‌ సినిమా గుర్తొస్తోంది..!

Tue 10th Nov 2015 04:04 PM
loafer movie,varun tej,poori jagannath,prabhas,ek niranjan  ప్రభాస్‌ సినిమా గుర్తొస్తోంది..!
ప్రభాస్‌ సినిమా గుర్తొస్తోంది..!
Advertisement
Ads by CJ

పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మాతగా సీకె ఎంట్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మెగాహీరో వరుణ్‌తేజ్‌ నటించిన 'లోఫర్‌' చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ను చూసిన వారు ఈ ట్రైలర్‌ పూరీ స్టాండర్డ్స్‌లో లేదని అంటున్నారు. గతంలో పూరీ దర్శకత్వంలోనే ప్రభాస్‌ హీరోగా చేసిన 'ఏక్‌నిరంజన్‌' చిత్రం తరహాలో ఈ ట్రైలర్‌ ఉందని అంటున్నారు. ఏదేమైనా తన మొదటి రెండు చిత్రాలతో క్లాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న వరుణ్‌తేజ్‌ తన మూడో చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు, మాస్‌కు బాగా దగ్గరవ్వాలని భావిస్తున్నాడు. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన రవితేజ 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' తరహాలో ఈ చిత్రం మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిందని తెలుస్తోంది. ఇందులో వరుణ్‌తేజ్‌ తల్లి పాత్రలో రేవతి నటిస్తోంది.