Advertisementt

రామ్‌కి 'హరికథ' మీద నమ్మకం పోయింది!

Thu 12th Nov 2015 03:06 PM
ram,harikatha movie,hero ram,nenu sailaja movie,harikatha title change,sravanthi ravikishore  రామ్‌కి  'హరికథ' మీద నమ్మకం పోయింది!
రామ్‌కి 'హరికథ' మీద నమ్మకం పోయింది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవర్‌ఫుల్‌ టైటిల్స్‌కు కాలం చెల్లింది. కేవలం సాఫ్ట్‌ టైటిల్స్‌తో ఆసక్తికరమైన టైటిల్స్‌ ఉండే చిత్రాలను ప్రేక్షకలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 'అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో' వంటి టైటిల్స్‌ వైపు స్టార్‌హీరోలు కూడా మొగ్గు చూపిస్తున్నారు. కాగా ప్రస్తుతం యువహీరో రామ్‌ కూడా అలాంటి టైటిల్‌నే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో పెద్దనాన్న స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు.  ఈ చిత్రానికి ఇప్పటివరకు 'హరికథ' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్‌ బాగానే ఉన్నప్పటికీ ఎందుకో కానీ రామ్‌కు ఈ టైటిల్‌ పెద్దగా నచ్చలేదట. దాంతో ఈ సినిమాకు 'నేను శైలజ' అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం రెండు పాటలు మినహా మిగిలిన షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకొంది. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌.. రామ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 1 వతేదీన కొత్త సంవత్సరంలో మొదటి చిత్రంగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ