Advertisementt

రామ్‌చరణ్‌ రికార్డ్‌ని క్రాస్‌ చేసిన అఖిల్‌.!

Sat 14th Nov 2015 03:27 PM
telugu movie akhil,akhil movie first day collections,akhil crossed ramcharan record,akhil movie review in cinejosh,akhil first day share 10 crores  రామ్‌చరణ్‌ రికార్డ్‌ని క్రాస్‌ చేసిన అఖిల్‌.!
రామ్‌చరణ్‌ రికార్డ్‌ని క్రాస్‌ చేసిన అఖిల్‌.!
Advertisement
Ads by CJ

అఖిల్‌ అక్కినేని తొలి చిత్రం అఖిల్‌ మొత్తానికి దీపావళికి రిలీజ్‌ అయింది. సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్‌ మాత్రం బాగానే వచ్చాయి. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్‌లలో 10 కోట్లకు పైగా షేర్‌ సాధించింది. ఒక డెబ్యూ హీరోగా మొదటిరోజు 10 కోట్లు షేర్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు అఖిల్‌. 

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మొదటి చిత్రం చిరుత 2007లో రిలీజ్‌ ఆయింది. ఆ చిత్రం మొదటి వారం 8 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేయడం డెబ్యూ హీరోల్లో అప్పటికి అది రికార్డ్‌. ఆ రికార్డ్‌ని అఖిల్‌ చిత్రం మొదటిరోజే క్రాస్‌ చేసేసింది. ఎనిమిది సంవత్సరాల క్రితం టికెట్స్‌ రేట్స్‌తో పోల్చుకుంటే ఇప్పటి రేట్లు చాలా ఎక్కువ. అయినప్పటికీ అఖిల్‌ చిత్రం మొదటిరోజే 10 కోట్ల షేర్‌ సాధించడం అక్కినేని అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తెచ్చింది. అయితే సినిమాకి వచ్చిన టాక్‌ దృష్ట్యా సోమవారం ఈ సినిమా కలెక్షన్ల పరంగా స్టాండ్‌ అవుతుందా? లేదా? అనేది డౌటేనని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

అఖిల్‌ మొదటి రోజు కలెక్షన్స్‌ 

నైజాం 2 కోట్ల 57 లక్షలు 

సీడెడ్‌ 1 కోటి 65 లక్షలు 

వైజాగ్‌ 81 లక్షలు 

ఈస్ట్‌ గోదావరి 79 లక్షలు 

వెస్ట్‌గోదావరి 45 లక్షలు 

గుంటూరు 85 లక్షలు 

నెల్లూరు 40 లక్షలు 

కృష్ణా 66 లక్షలు 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ