బాలీవుడ్ లో ఒక సంప్రదాయం వుంది. ఏదైనా ఒక పండుగను సెలెబ్రేట్ చేసుకోవడానికి పార్టీ లు ఇస్తూ వుంటారు. దీపావళి పండుగను పురస్కరించుకుని అమితాబ్ ఇచ్చిన పార్టీ కి బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. ఆ పార్టీ కి అందరూ సాంప్రదాయ దుస్తులతో దర్శనమిచ్చారు. అందులో షారుఖ్, అనిల్ కపూర్ మాత్రం సాంప్రదాయ దుస్తులలో వచ్చి సిగరెట్స్ కాలుస్తు కనిపించారు. అది వాళ్ళకి పెద్దవిషయం కాకపోవచ్చు . నిజానికి ముంబై కల్చర్ కి - బాలీవుడ్ లో ఉండే సంస్కృతికి ఇది పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఓ సాంప్రదాయ పార్టీకి అటెండ్ అవుతూ.. ఇలా పొగ పీలుస్తూ రావడమే అసలు విషయం. ఇది పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ పంపినట్లు అవుతుందని, ఇకపై ఇలాంటివి పబ్లిక్ లో ఈ స్టార్ హీరోస్ చేయకుండా వుంటే మంచిదనే అభిప్రాయం అంతటా వ్యక్త మవుతోంది.