రామ్‌చరణ్‌తో భారీగా 'బ్రూస్‌లీ' చిత్రాన్ని నిర్మించిన దానయ్య ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదంటూ తన డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం ఇస్తున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 10కోట్లకు పైగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారు దానయ్యను పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. కానీ వీరిపై జాలి చూపించాల్సింది పోయి, వారికి నయా పైసా ఇచ్చేది లేదంటూ దానయ్య స్పందించాడు. పరిహారం ఇవ్వడం, డబ్బు తిరిగి ఇవ్వడం అనే ప్రశ్నే లేదని, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారనేది వాస్తవం కాదని అంటున్నాడు. అయినా వ్యాపారంలో లాభనష్టాలు అనేవి సహజం... అంటూ తనను కలిసిన డిస్ట్రిబ్యూటర్లకు మొహాన చెప్పేశాడట దానయ్య. దీంతో రామ్‌చరణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.