తెలుగు సినిమా హీరోలంతా మేమంతా ఒక్కటే.. మాది ఒకటే ఫ్యామిలీ అని బహిరంగంగా చెప్పినా స్టార్‌డమ్ విషయంలో మాత్రం ఒకరిపై ఒకరు మాత్రం పోటీపడుతున్నారనేది అంతర్గత వాస్తవం. ముఖ్యంగా స్టార్‌హీరోలు కలెక్షన్లు, కొత్త రికార్డులు విషయంలో తమదే పై చేయి వుండాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వీరి మధ్య మరో పోటీ నెలకొంది. అదే టీఆర్‌పీ రేటింగ్. తన సినిమా టీవీలో ప్రసారం అయినప్పుడు వచ్చే టీఆర్‌పీ రేటింగ్‌ను కూడా ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు టీఆర్‌పీ రేటింగ్‌లో ‘మగధీర’ సినిమాదే అగ్రస్థానం. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి 600 కోట్లకుపైగా వసూలు చేసిన రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం కూడా మగధీర టీఆర్‌పీని క్రాస్ చేయలేదు. అయితే ఇటీవల జీ టీవీలో ప్రసారం అయిన ‘శ్రీమంతుడు’ చిత్రం టీఆర్‌పీ రేటింగ్ ఇంకా బయటికి రాలేదు. అంటే ఈ చిత్రం కూడా ‘మగధీర’ను క్రాస్ చేయలేదని అంటున్నారు మెగాభిమానులు.