Advertisementt

రిలీజ్‌కి ముందే జాక్‌పాట్‌ కొట్టిన అల్లుడు.!

Sun 15th Nov 2015 04:39 PM
bellamkonda suresh son bellamkonda srinivas,bhimaneni srinivasa rao new movie,bellamkonda srinivas new movie,bellamkonda srinivas new movie releasing on sankranthi  రిలీజ్‌కి ముందే జాక్‌పాట్‌ కొట్టిన అల్లుడు.!
రిలీజ్‌కి ముందే జాక్‌పాట్‌ కొట్టిన అల్లుడు.!
Advertisement
Ads by CJ

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన తొలి చిత్రం అల్లుడు శీను 40 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అయిందీ, ఎంత కలెక్ట్‌ చేసిందనేది పక్కన పెడితే శ్రీనివాస్‌ ఇప్పుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి మాత్రం బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ వచ్చిందని తెలుస్తోంది. 

తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన సుందర పాండ్యన్‌ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో గుడ్‌విల్‌ సినిమా పతాకంపై తనే నిర్మిస్తున్నాడు భీమనేని శ్రీనివాసరావు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. శ్రీనివాస్‌ రెండో సినిమాకి బిజినెస్‌పరంగా మంచి క్రేజ్‌ వచ్చిందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. అదేమిటంటే ఈ చిత్రాన్ని సీడెడ్‌ ఏరియాకు 3 కోట్ల 51 లక్షలకు కొనుక్కున్నాడు ఓ డిస్ట్రిబ్యూటర్‌. ఈ సినిమా మీద తనకు హండ్రెడ్‌ పర్సెంట్‌ నమ్మకం వుందని, అందుకే అడ్వాన్స్‌గా ఈ సీడెడ్‌ ఏరియాకు కొనేసుకున్నానని చెప్తున్నాడు ఆ డిస్ట్రిబ్యూటర్‌. ఇది టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ఇప్పుడే ఇలా వుంటే సంక్రాంతికి రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రం బిజినెస్‌పరంగా మరెన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో మరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ