ఇటీవల ‘బ్రూస్‌లీ’ పరాజయంతో పాటు కుటుంబ గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు దర్శకుడు శ్రీనువైట్ల. ముఖ్యంగా ‘బ్రూస్‌లీ’ అపజయంతో పాటు భార్య రూప తనపై పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టడం.. ఇలా ఊహించని పరిణామలు ఎదురయ్యేసరికి.. నలుగురికి కాస్త దూరంగా వుండాలని నిర్ణయించుకుని భార్య రూపతో రాజీపడి ఆమెతో కలిసి చైనా టూర్‌కు వెళ్లాడు శ్రీనువైట్ల. అయితే సరిగ్గా అఖిల్ సినిమా విడుదలైన మరుసటి రోజే శ్రీనువైట్ల ఇండియాకు తిరిగిరావడంతో.. అఖిల్ సినిమా రిజల్ట్ తెలుసుకున్నందునే ఆయన చైనా టూర్ నుంచి వచ్చేశాడని... బ్రూస్‌లీ కంటే ఘోరమైన పరాభావం అఖిల్‌ది అంటున్నారనే వార్తను తెలుసుకుని ఇక బ్రూస్‌లీకి మించిన డిజాస్టర్ సినిమా వచ్చిందని... ఇక నలుగురులో తిరగొచ్చు. పర్వాలేదని అనుకోని మరీ శ్రీనువైట్ల ఇండియాకొచ్చాడనే సెటైర్లు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. ఇదంతా సెటైరిక్‌గా అనిపించినా..ఇద్దరు అగ్ర దర్శకులు.. భారీ బడ్జెట్‌లతో తెరకెక్కించిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడం బాధాకరమని అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు.