ఇక 'అఖిల్' చిత్రంతో భారీ చిత్రాల హంగామా ముగిసింది. ఇక కేవలం రవితేజ 'బెంగాల్‌టైగర్', గోపీచంద్ 'సౌఖ్యం' సినిమాలు తప్ప మిగిలిన చిత్రాలన్ని చిన్నసినిమాలే. ఈ జాతర 'కుమారి 21ఎఫ్'తో మొదలుకానుంది. ఆ తర్వాత నిఖిల్ 'శంకరాభరణం', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', అనుష్క 'సైజ్‌జీరో' వంటి చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక మోహన్‌బాబు, అల్లరినరేష్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'మామ మంచు .. అల్లుడు కంచు' చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఇలా ఆసక్తి రేపే చిత్రాలే కాక అసలు ఎవ్వరూ పట్టించుకోని పలు చిన్న సినిమాలు సంక్రాంతిలోపు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక మన పెద్ద హీరోల చిత్రాలు మళ్లీ సంక్రాంతి సీజన్‌లోనే విడుదలవుతాయి. మిగిలిన సమయమంతా చిన్న సినిమాల జాతరే కొనసాగనుంది.