ఈమధ్యకాలంలో ఎన్టీఆర్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేసినా ఆ డైరెక్టర్‌కి రీసెంట్ హిట్ ఒకటి వుండేది. కిక్ తర్వాత సురేందర్‌రెడ్డితో ఊసరవెల్లి, దూకుడు తర్వాత శ్రీను వైట్లతో బాద్‌షా, గబ్బర్‌సింగ్ తర్వాత హరీష్ శంకర్‌తో రామయ్యా వస్తావయ్యా.. ఇలా రీసెంట్‌గా ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ అలాంటివే. అయితే ఆయా డైరెక్టర్లు సూపర్ డూపర్‌హిట్ సినిమాలు చేశారు కాబట్టి మన సినిమాకి ఢోకాలేదు అనే కాన్సెప్ట్‌తో ఎన్టీఆర్ వెళ్ళిపోతూ వుంటాడు. కానీ, ఇప్పుడు సుకుమార్‌తో ఎన్టీఆర్ చేస్తున్న నాన్నకు ప్రేమతో పరిస్థితి ఏమిటి? ఈ సినిమాకి ముందు సుకుమార్‌కి 1 నేనొక్కడినే అనే ఫ్లాప్ సినిమా వుంది. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా సుకుమార్ ఒక మంచి సినిమా తీశాడు అనే పేరు మాత్రం వచ్చింది. తన డైరెక్టర్ మంచి సినిమాయే కాదు, కమర్షియల్‌గా కూడా హిట్ సినిమా చేసి వుండాలన్న ఎన్టీఆర్ ఆలోచనకు భిన్నంగా సుకుమార్‌తో సినిమా చెయ్యడం కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. పైగా ఇంతకుముందెన్నడూ కనిపించని కొత్త గెటప్‌లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌కి, సుకుమార్‌కి కూడా డిఫరెంట్ మూవీనే.
లండన్‌లో 60 రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ 19 నుంచి స్పెయిన్‌లో ఓ 20 రోజుల షెడ్యూల్ చెయ్యబోతున్నారు. దీంతో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఆడియో రిలీజ్ చెయ్యబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరిలో విడుదల కాబోతోంది. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్‌తో ఎన్టీఆర్ సినిమా చెయ్యడం అనేది ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే డేరింగ్ స్టెప్పే అనుకోవాలి. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు విపరీతమైన టెన్షన్‌కు గురవుతున్నారని తెలుస్తోంది. రామయ్యా వస్తావయ్యా, రభస ఫ్లాప్‌ల తర్వాత పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో టెంపర్‌తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన ఎన్టీఆర్‌కి నాన్నకు ప్రేమతో ఎలాంటి రిజల్ట్ నిస్తుందన్నది అభిమానులకు పెద్ద టెన్షన్‌గా మారింది.