జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుత గడ్డు పరిస్థితికి ఇది కారణమంటూ లెక్కలేయలేక పోయినా రానున్న నాన్నకు ప్రేమతో మీద మాత్రం అభిమానులతో సహా ప్రేక్షకులు కూడా ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ యూ ట్యూబులో దుమ్ము దులిపింది. అవే రకమైన రికార్డులు రేపు థియేటర్లలో కూడా ఖాయం అన్న భావనలో ఉన్నారు ఫ్యాన్స్. సుకుమార్ దర్శకత్వ శైలికి తోడు ఎన్టీయార్ స్టైలింగ్ చూసి మతి పోగొట్టుకున్న జనాలు, ఇటువంటి గెటప్పును ఓ పాటలోనో లేక ఓ ఎపిసోడులోనో అయితే ఓకే కానీ సినిమా సాంతం ఎన్టీయార్ ఇలాగే ఉంటాడంటే దడుసుకు ఛస్తున్నారు. స్టైలిష్ మాట అటుంచి కథను వదిలి తారక్ మీద ఇలాంటి పరిశోధనలు చేసిన చాలా మంది దర్శకులకు ఘోరాతి ఘోరమైన పరాభావాలే ఎదురయ్యాయి. బుడ్డోడిలో ఉన్న శక్తిని నిద్ర లేపండి అంతే గానీ ఇలా హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ పట్టుకొని కష్టాలు కోరి తెచ్చుకోకండి అన్నది కొందరి సిని విశ్లేషకుల సలహా.