Advertisementt

'అఖిల్‌' కి చివరికి అలా జరిగిందన్నమాట.!

Mon 16th Nov 2015 01:11 PM
telugu movie akhil,akhil introductory movie akhil,akhil and vinayak combo movie,akhil collections,akhil movie review,akhil movie review in cinejosh  'అఖిల్‌' కి చివరికి అలా జరిగిందన్నమాట.!
'అఖిల్‌' కి చివరికి అలా జరిగిందన్నమాట.!
Advertisement
Ads by CJ

'అఖిల్‌' చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయిన తొలి చిత్రంతోనే సూపర్‌హిట్‌ హీరో అనిపించుకోవాలన్న అఖిల్‌ కోరిక నెరవేరలేదు. బుధవారం రిలీజ్‌ అయిన ఈ సినిమాకి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఆ ఆనందం అంతా ఒక్కరోజుతోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఏ ఏరియాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్‌ లేవు. వీకెండ్‌ కలెక్షన్స్‌ కూడా లేక అఖిల్‌ సినిమా మరింత వీక్‌ అయిపోయింది. అఖిల్‌, వినాయక్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకి మంచి బిజినెస్‌ చేసి పెట్టారు. కానీ, ఇప్పుడు వాళ్ళందరూ భారీ నష్టాలు చవిచూస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అయిందని చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకొచ్చిన నాగార్జున ఆ తర్వాత రిలీజ్‌ అయ్యేంతవరకు ఎక్కడా అతని జాడలేదు. రిలీజ్‌ తర్వాత సినిమాకి బ్యాడ్‌ టాక్‌ వున్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్‌ బాగుండడంతో తనవల్ల ఆ కలెక్షన్స్‌ స్టడీగా వుంటాయన్న ఉద్దేశంతో సక్సెస్‌మీట్‌లో మాట్లాడేశాడు. కానీ, అది కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు. మేం ఈ సినిమా ఫ్లాప్‌ అని డిసైడ్‌ అయ్యాం అంతే అని ఆడియన్స్‌ భీష్మించుకు కూర్చున్నారు. ఈ సినిమాని రన్‌ చెయ్యడం తమ వల్ల కాదని ఎగ్జిబిటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ సినిమాని గురువారానికి చాలా థియేటర్లలో ఎత్తేస్తున్నారు. హీరోగా అఖిల్‌కి మంచి పేరు వచ్చింది. డాన్సులు, ఫైట్స్‌లు ఎంతో కష్టపడి బాగా చేశాడు అని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, సినిమా హిట్‌ అని మాత్రం చెప్పలేకపోతున్నారు. అదీ సంగతి. చివరికి అఖిల్‌ ఎంట్రీ అలా జరిగిందన్నమాట. 

Click Here to see Akhil Review 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ