Advertisementt

మళ్ళీ తెలుగులోకి రాదేమో?

Mon 16th Nov 2015 03:17 PM
sayesha saigal,shivaay,akhil  మళ్ళీ తెలుగులోకి రాదేమో?
మళ్ళీ తెలుగులోకి రాదేమో?
Advertisement
Ads by CJ

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు యావత్ పరిశ్రమ కూడా హీరో సెంట్రిక్ అన్నది జగమెరిగిన సత్యం. హీరోలు తలుచుకుంటేనే నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు, ఆఖరుకి టెక్నిషియన్స్ కూడా బతికి బట్ట కట్టేది. ఇది తెలిసి కూడా బాలివుడ్ బడా ఫ్యామిలీకి చెందిన సాయేశా సైగల్ ఎంతో ఆశపడి అక్కినేని కుర్రోడు అఖిల్ సరసన చేసిన అఖిల్ కాస్తా బొక్కబోర్లా పడడంతో టాలివుడ్ వైపు మరోసారి కన్నెత్తి కూడా చూడను అంటోందట అమ్మడు. టైటిల్ దగ్గరి నుండి అన్నింటా అఖిల్ పేరుతోనే ప్రమోట్ అయిన అఖిల్ చిత్రం నిజానికి సాయేశాకు వేదననే మిగిల్చింది. సినిమా కథ, కథనం మొత్తం హీరోయిన్ వైపు నుండే నడిచినా, పాపం సాయేశా పాత్రకు మాత్రం ఎటువంటి ఔచిథ్యమ్ లేకుండా పోయింది. పాటల్లో కూడా అఖిల్ నృత్యాలకు దీటుగా డ్యాన్స్ చేసిన సాయేశా ఒక్కోసారి హీరోని కూడా డామినేట్ చేసే గ్రేసు ప్రదర్శించింది. ఎంత కష్టపడ్డా, అందరూ అఖిల్ తరపునే ఉండడంతో టాలివుడ్ అసలు సంగతి సాయేశాకు లేటుగా తెలిసింది. చేసేది లేక అజయ్ దేవగన్ హిందీ చిత్రం శివాయ్ కోసం హైదరాబాద్ విడిచి ముంబై పయనం అయింది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ