Advertisementt

స్టార్స్‌పై అలిగిన పూరీ..!

Mon 16th Nov 2015 08:36 PM
poorijagannath,chiranjeevi,temper,loafer,varun tej  స్టార్స్‌పై అలిగిన పూరీ..!
స్టార్స్‌పై అలిగిన పూరీ..!
Advertisement
Ads by CJ

పూరీజగన్నాథ్‌ స్టైల్‌ మార్చాడా? అని అంటే అవుననే సమాధానమే వస్తోంది. స్టార్స్‌ కంటే చిన్న హీరోలు అయితేనే బెటర్‌ అని పూరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పూరీ స్టార్స్‌పై అలగడం వెనక కూడా ఓ కారణం ఉంది. చిరంజీవి 150వ చిత్రానికి పూరీని అనుకొని, ఆయన ఎంతో కష్టపడి తయారుచేసిన స్క్రిప్ట్‌ను మొదట ఓకే చెప్పి ఆ తర్వాత మాట మార్చిన చిరంజీవి వ్యవహారం పూరీని అందరి ముందు అవమానానికి గురిచేసిందని అంటున్నారు. అందుకే ఆయన ప్రస్తుతం అప్‌కమింగ్‌ మెగాహీరో వరుణ్‌తేజ్‌తో 'లోఫర్‌' చిత్రం తీస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తర్వాత పూరీ మరో యువ హీరోను వెండితెరకు పరిచయం చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రం టైటిల్‌ 'రోగ్‌'. చార్మితో 'జ్యోతిలక్ష్మీ' తీసి డేరింగ్‌ అనిపించుకున్న పూరీ, తర్వాత 'లోఫర్‌' అంటూ, ఇప్పుడు 'రోగ్‌' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ఆయన ఇషాన్‌ అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులో కూడా రూపొందనుంది. కాగా హీరో ఇషాన్‌ అంటే మరెవ్వరో కాదు.. శ్రీకాంత్‌-కృష్ణవంశీల కాంబినేషన్‌లో వచ్చిన 'మహాత్మ' చిత్ర నిర్మాత మనోహర్‌ కొడుకే ఈ ఇషాన్‌. ఇలా చిన్నవారితో వరుస సినిమాలు చేస్తున్న పూరీ మహేష్‌తో కూడా ఇప్పటికప్పుడు పనిచేసే అవకాశమే లేదంటున్నాయి సినీ వర్గాలు. అటు మహేష్‌ ఇతర దర్శకులతో బిజీగా ఉండటం, పూరీ కూడా స్టార్స్‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఎవ్వరి కోసం ఆగేది లేదనే సంకేతాలు పంపుతుండటంతో ఇప్పట్లో పూరి స్టార్స్‌ తో సినిమా చేయడం సాధ్యం కాదని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ