హైదరాబాద్ నగరం లో నిన్న(నవంబర్ 16) జరిగిన మిర్రర్స్ సెలూన్ ప్రారంభోత్సవానికి ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. వాళ్ళ లో నట సింహం బాలయ్య కూడా వున్నాడు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మిర్రర్స్ సెలూన్ వారు ర్యాంప్ వాక్ ను ఏర్పాటు చేసారు. ఎప్పుడూ భారీ డైలాగ్స్ చెబుతూ.. పౌరుషానికి మారు పేరుగా వుండే బాలయ్య, ఈ ర్యాంప్ వాక్ లో మోడల్స్ మద్యన నడుస్తూ హోయలోలికించాడు. ఈ ర్యాంప్ వాక్ లో బాలయ్యను చూసిన వారంతా.. బాలయ్య తన వయస్సును మర్చిపోయి మరి కుర్రాడిలా.. ర్యాంప్ లో రెచ్చిపోయాడని అనుకోవడం విశేషం.