'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్. 'సినిమా చూపిస్త మావ' తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకొంది. పద్దతైన పాత్రలకు, పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లతో అవికాగోర్ రానురాను అలాంటి పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇక మీదన ఇలాంటి పాత్రల్లోనే కనిపిస్తారా? అని అడిగితే ఈ విషయంలో నాకు మరో చాయిస్ లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేసింది. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అంటూ దర్శకుడు ఏం చెప్తే అది చేయాలని చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకోవడం నా వల్ల కాదు. నాకు అలాంటివి పడవు. ఏ డ్రస్సు వేసుకొన్నా అందంగా కనిపించడం ముఖ్యం. సకుటుంబ సపరివార సమేతంగా సినిమా చూసినప్పుడు వాళ్ల మద్య నా డ్రస్సు టాపిక్ కాకూడదు. ఒకవేళ అలాంటి డ్రస్సులు వేసుకోమని ఇబ్బందిపెడితే... ఆ సినిమానే వదులుకుంటాను.. అంటోంది అవికాగోర్.