Advertisementt

'ఢీ' నా!, 'రెఢీ' నా! శ్రీనువైట్ల దారెటు?

Wed 18th Nov 2015 10:15 AM
srinu vaitla,manchu vishnu,ram,dhee,ready,srinu vaitla movie after bruce lee,aagadu  'ఢీ' నా!, 'రెఢీ' నా! శ్రీనువైట్ల దారెటు?
'ఢీ' నా!, 'రెఢీ' నా! శ్రీనువైట్ల దారెటు?
Advertisement
Ads by CJ

మ‌రోసారి 'ఢీ' కొట్ట‌బోతున్నాడ‌ని కొంత‌మంది, కాదు కాదు ఇంకోసారి 'రెడీ' కాంబినేష‌న్ సెట్ట‌య్యింద‌ని మ‌రికొంత‌మంది.  నిజంగా శ్రీనువైట్ల ప్లానింగేంట‌న్న‌ది మాత్రం ఇంకా బ‌య‌టికి రావ‌డం లేదు. బ్రూస్‌లీ సినిమాతో శ్రీనువైట్ల కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. ఇదివ‌ర‌కు వైట్ల అంటే స్టార్ క‌థానాయ‌కులు మాత్ర‌మే మ‌దిలోకి వ‌చ్చేవారు. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో శ్రీనువైట్లతో సినిమా చేయ‌డానికి ఏ స్టార్ కూడా సాహ‌సం చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అందుకే వైట్ల యంగ్ హీరోల‌పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు రామ్‌, మంచు విష్ణుల్లో ఒక‌రితో శ్రీనువైట్ల సినిమా చేయొచ్చ‌ని స‌మాచారం. 

ఇదివ‌ర‌కు విష్ణుతో క‌లిసి 'ఢీ' చేశాడు వైట్ల‌. ఆ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత రామ్‌తో చేసిన 'రెడీ' కూడా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ రెండు సినిమాల‌తో శ్రీనువైట్ల పేరు మార్మోగిపోయింది. అక్క‌డ్నుంచి శ్రీనువైట్ల స్టార్ క‌థానాయ‌కుల‌తోనే  సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోయాడు. కానీ ఇటీవ‌ల 'ఆగ‌డు, బ్రూస్‌లీ' సినిమాలు దారుణంగా ప‌రాజ‌యాన్ని చ‌విచూడటంతో శ్రీనువైట్ల ప్రభావం తగ్గిపోయింది. ఇక చేసేదేం లేక మ‌ళ్లీ విష్ణు, రామ్‌ల‌తో సినిమాలు చేసేందుకు ప్లాన్  చేసుకున్న‌ట్టు స‌మాచారం. మొద‌ట రామ్‌తోనే సినిమా చేస్తాడ‌ని, ఆ త‌ర్వాత విష్ణుతో సినిమా చేస్తాడ‌ని తెలిసింది. రామ్‌, విష్ణుల‌తో శ్రీనువైట్ల సినిమా  అనేస‌రికి 'ఢీ, రెఢీ' సినిమాల‌కి సీక్వెల్స్ చేస్తుండొచ్చని ప్ర‌చారం సాగుతోంది. కానీ 'ఢీ, రెఢీ' ఫార్ములాల‌పై ఇప్ప‌టికే బోలెడ‌న్ని విమ‌ర్శ‌లున్నాయి. అందుకే  శ్రీనువైట్ల ఆ  రొటీన్ ఫార్ములాకి భిన్నంగా ఈసారి సినిమా తీయొచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ