బ్రూస్ లీ దెబ్బతో మెగా కాంపౌండ్ మొత్తం సైలెంట్ అయిపొయింది. రామ్ చరణ్ అయితే ఫ్యామిలీ ఔటింగ్ అంటూ పత్తా లేకుండా వెళ్ళిపోయాడు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మాత్రం తమ తమ సినిమాలతో బిజీగా ఉంటె అల్లు అర్జున్ కూడా సరైనోడుతో టైం స్పెండ్ చేస్తున్నాడు. మళ్ళీ మాట్లాడితే చిరంజీవి నూట యాభయ్యో చిత్రం మీద ఏదో ఒక రచ్చ జరిగే చాన్సు ఉన్నందున అందరు గమ్మున ఉండిపోయారు. బ్రూస్ లీ షాకు నుండి కోలుకుని రామ్ చరణ్, చిరంజీవి మళ్ళీ మామూలు మనుషులు కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గెలుపోటముల నుండి ఏళ్ళ తరబడి ఎన్నో లెసన్స్ నేర్చుకున్న చిరంజీవి మాత్రం చరణ్ అండ్ ఫ్యామిలీ మొత్తాన్ని బ్రూస్ లీ తాలూకు చేదు అనుభూతులని మరిచిపొమ్మని, తొందరగా తమ తమ రెగ్యులర్ వర్కులో బిజీ అయిపొమ్మని గీతోపదేశం చేస్తున్నారంట. అందుకేనేమో తని ఒరువన్ తెలుగు రీమేక్ పనులు ఇప్పుడుప్పుడే చురుగ్గా మొదలవుతున్నాయి. ఒక్కసారి రామ్ చరణ్ తిరిగి వచ్చేస్తే మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. చేసిన తప్పుల నుండి నేర్చుకుని జీవితం సాఫీగా ముందుకు సాగాలి... అలాగే చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా చరణ్ జాగ్రత్తపడితే చిరంజీవికి ఎప్పటికీ పుత్రోత్సాహమే మిగులుతుంది.