'సిసింద్రి' సినిమాలో పసిప్రాయంలోనే నటించి తన ముద్దు ముద్దు చేష్టలతో ఆకట్టుకున్న అక్కినేని అఖిల్.. ‘మనం’ చిత్రంలో తళుక్కున మెరిసి.. అందరిలోనూ ఆసక్తిని పెంచాడు. ఇక ‘అఖిల్’తో హీరోగా పరిచయమైన ఈ అక్కినేని వారసుడు తొలిచిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తొలిపరిచయంలోనే మాస్ హీరోగా గుర్తింపు సంపాందించుకోవాలనే తాపత్రయంతో తప్పడుగు వేసి తుస్సుమనిపించాడు. మొదటిచిత్రంతో నిరాశపరిచిన నాగచైతన్యలా.. అఖిల్ కూడా అక్కినేని అభిమానులను నిరాశపరిచాడు. ఇక ఇప్పుడిప్పుడే తొలిచిత్రం ఇచ్చిన షాక్ నుంచి కోలుకుంటున్న అఖిల్.. ఇదంతా మరిచిపోయి.. ఈసారి ఓ క్యూట్ లవ్‌స్టోరీని ఎంచుకోవాలనే ఆలోచనలో వున్నాడు. అఖిల్ రెండో సినిమానే తొలి సినిమాగా భావించి కెరీర్‌ను పక్కా ప్లానింగ్‌తో ట్రాక్‌లో పెట్టాలని నాగార్జున ప్రణాళికలు వేస్తున్నాడట. సో.. మరోసారి అఖిల్‌ని హీరోగా పరిచయం చేసి.. అదే అతని పరిచయ చిత్రంగా గ్రాండ్‌గా మరోసారి ఇంట్రడ్యూస్ చేయనున్నాడు నాగ్.