Advertisementt

చివరి ప్రయత్నం చేస్తున్న అక్కినేని హీరో.!

Thu 19th Nov 2015 06:03 PM
hero sumanth,sumanth new movie details,sumanth new movie in his own banner,producer supriya,sumanth new movie in progress  చివరి ప్రయత్నం చేస్తున్న అక్కినేని హీరో.!
చివరి ప్రయత్నం చేస్తున్న అక్కినేని హీరో.!
Advertisement
Ads by CJ

ప్రేమకథ చిత్రంతో హీరోగా పరిచయమైన సుమంత్‌కి అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలా తక్కువ. 20కి పైగా చిత్రాల్లో హీరోగా నటించినా ప్రేక్షకులు అతన్ని హీరోగా రిసీవ్‌ చేసుకోలేకపోయారు. సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్‌ వంటి చిత్రాలకు మంచి పేరు వచ్చినా ఆ క్రెడిట్‌ దర్శకనిర్మాతలకే వెళ్ళింది తప్ప సుమంత్‌కి ప్రత్యేకంగా ఎలాంటి అప్రిషియేషన్‌ రాలేదు. ఈమధ్యకాలంలో అతనితో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అందుకే తనే నిర్మాతగా ఓ సినిమాని స్టార్ట్‌ చేసేశాడు సుమంత్‌. 

మల్లేశ్వర్‌ అనే కొత్త డైరెక్టర్‌తో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు సుమంత్‌. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి యస్‌.యస్‌.క్రియేషన్స్‌ పతాకంపై శివ వంటి ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీని నిర్మించాడు సుమంత్‌ తండ్రి యార్లగడ్డ సురేంద్ర. ఇప్పుడు అదే బేనర్‌పై సుమంత్‌, సుప్రియ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. అలా తన సొంత బేనర్‌లో సినిమా చేస్తూ హీరోగా నిలబడేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాడు సుమంత్‌. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ