'కిక్2' డిజాస్టర్ ఫలితంతో రవితేజ ఎంతో మారాడు. గతంలో తనకు హిట్లు ఇచ్చిన స్టార్‌డైరెక్టర్లను, ఇప్పటికే ఇతరులకు హిట్టిచ్చిన డైరెక్టర్లను నమ్ముకోకుండా యంగ్‌టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కాంబినేషన్‌పై కాకుండా టాలెంట్‌కు, కథకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకుంటున్నాడు. కిక్కిచ్చే కుర్రాళ్లే నయమంటున్నాడు. 'కిక్2' చిత్రంతో రవితేజ ఇమేజ్‌కు భారీగా డామేజ్ అయింది. ఆయన క్రేజ్ మసకబారింది. దీంతో పోయిన క్రేజ్‌ను మరలా సంపాదించే పనిలో రవితేజ నిమగ్నమై ఉన్నాడు. ప్రస్తుతం నవతరం దర్శకుడు సంపత్‌నందితో 'బెంగాల్‌టైగర్' చేశాడు. ఈ చిత్రం డిసెంబర్10న విడుదలకు సిద్దమవుతోంది. తదుపరి చిత్రంగా దిల్‌రాజ్ నిర్మాతగా 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణుశ్రీరామ్‌తో 'ఎవడో ఒకడు' ప్రారంబించాడు. త్వరలో సుధీర్‌వర్మ డైరెక్షన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇందులో రవితేజ డ్యూయల్‌రోల్‌లో కనిపించనున్నాడట. ఇందులో తండ్రి కొడుకులుగా రవితేజ నటిస్తాడని, తండ్రి పాత్ర మాఫియా డాన్ పాత్రగా ఉంటుందని సమాచారం. మరి ఈ కొత్తదారి రవితేజకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాల్సివుంది..!