'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్రహ్మానందం తనయుడు గౌతమ్. ఈ సినిమా ఆడలేదు. కొంతగ్యాప్ తీసుకొని 'వారెవా' చిత్రం చేశాడు. అది కూడా పోయే. మళ్లీ గ్యాప్ తీసుకొని 'బసంతి'తో అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. కానీ రిజల్ట్ మాత్రం సేమ్. ఇప్పుడు మళ్లీ కొంతగ్యాప్ తీసుకొని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ 'వాడెవడు'. ఈ సినిమాతో రమేష్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. సంక్రాంతికి ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ కొత్త అమ్మాయి కోసం అన్వేషణ సాగుతోంది. 'బసంతి' సమయంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని గ్రాండ్ పబ్లిసిటీ ఇప్పించాడు బ్రహ్మానందం. అయినా సరే ప్రేక్షకులు కరుణించలేదు. మరి ఈసారి బ్రహ్మానందం ఏంచేస్తాడో చూడాలి....!