Advertisementt

బాలీవుడ్ లోకి పవన్‌ హీరోయిన్‌..!

Sat 21st Nov 2015 05:59 PM
bhumika,laddubabu,mahendhra singh dhoni,neeraj pandey  బాలీవుడ్ లోకి పవన్‌ హీరోయిన్‌..!
బాలీవుడ్ లోకి పవన్‌ హీరోయిన్‌..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌తో కలిసి 'ఖుషీ' వంటి బ్లాక్‌బస్టర్‌లో నటించిన హీరోయిన్‌ భూమిక ఆ తర్వాత పలువురు స్టార్స్‌ సరసన నటించింది. ఆ తర్వాత ఆమె భరత్‌ఠాకూర్‌ను పెళ్లి చేసుకొని కొంతకాలం వెండితెరకు దూరంగా ఉంది. ఇటీవల అల్లరినరేష్‌-రవిబాబుల కాంబినేషన్‌లో వచ్చిన 'లడ్డూబాబు'లో కూడా ఆమె మంచిపాత్రనే చేసింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో మరలా ఆమె మరికొంతకాలం గ్యాప్‌ తీసుకొని ఓ హిందీ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ధోని జీవిత గాధ ఆధారంగా బాలీవుడ్‌లో నీరజ్‌పాండే దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్రను చేయడానికి భూమిక ఓకే చేసింది. ఈ చిత్రంతో తనకు వచ్చే రెస్పాన్స్‌ను చూసి మరలా సౌత్‌ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించాలనేది ఆమె ఆలోచనగా ఉందిట...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ