సెట్టింగ్స్ భారీతనానికి, పెరిగిపోయిన సాంకేతికతను నిక్కచ్చిగా వాడుకున్న ఘనతకు నిలువెత్తు రూపంగా బాహుబలి పెక్కు ప్రసిద్ది చెందింది. రాజమౌళి పేరు ఈ చిత్రరాజంతో యావత్ భూగోళం మీద మార్మోగింది. భారతీయ సినీ ప్రస్థానంలో ఇదో మేటి మలుపు అంటూ జనాలు కీర్తించారు కూడా. అంతటి దృశ్య కావ్యాన్ని సైతం కొంతైనా తక్కువ చేసి చూసేలా తయారయింది సంజయ్ లీలా భన్సాలి బాజీరావు మస్తాని. రనవీర్ సింగ్, దీపిక పదుకొనె, ప్రియాంక చోప్రా ముఖ్య తారాగణంగా మరాఠా సామ్రాజ్యానికి చెందిన ఓ చారిత్రక ప్రేమ కథను తెర మీద ఆవిష్కరించే భారీ ప్రక్రియలో భన్సాలి మొదటి మెట్టుతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇప్పటికి విడుదలైన బాజీరావు మస్తాని రెండు ట్రైలర్లు, పాటలు ఒకదాన్ని మించి మరొకటి ఉండడంతో డిసెంబర్ 18న విడుదల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. భన్సాలి అంటేనే అడ్డగోలు ఖర్చుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. కానీ అతనే నిర్మాత, దర్శకుడు కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ అవాల్సిన అవసరం లేదు. ఫలితంగా ఏమొచ్చిందో ఈ ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుద్ది...