అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాతగా రూపొందిన 'అఖిల్' చిత్రంపై సినిమా ప్రారంభానికి ముందు నుండి బోలెడు అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం టైటిల్‌ను 'అఖిల్' అని నిర్ణయించిన తర్వాత మాత్రం అక్కినేని అభిమానులు ఆలోచనలో పడ్డారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు హీరోల పేర్లనే చిత్రాలకు పెట్టిన ఏ చిత్రం కూడా సరిగ్గా విజయం సాధించలేదు. చిరంజీవి నటించిన 'చిరంజీవి', 'జై చిరంజీవ', నాగార్జున నటించిన 'కెప్టెన్ నాగార్జున', మహేష్‌బాబు నటించిన 'మహేష్ ఖలేజా', 'కళ్యాణ్‌రామ్ కత్తి', బాలకృష్ణ నటించిన 'ఎన్.బి.కె. లయన్'... ఇలాంటి చిత్రాలన్నీ ఘోరపరాజయాలను మిగిల్చిన చిత్రాలే కావడం గమనార్హం. దీంతో అఖిల్ తొలి చిత్రానికి అతని పేరునే టైటిల్‌ను పెట్టడం కలిసి రాదేమో అని అందరు టెన్షన్ పడ్డారు. వారి అంచనాలను నిజం చేస్తూ 'అఖిల్' చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలవడం ఈ సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తోందని అంటున్నారు.