Advertisementt

బాలీవుడ్ హీరో చేతుల్లోకి కత్తి..!

Tue 24th Nov 2015 04:30 PM
akshay kumar,katthi remake in bollywood,chiranjeevi,ntr  బాలీవుడ్ హీరో చేతుల్లోకి కత్తి..!
బాలీవుడ్ హీరో చేతుల్లోకి కత్తి..!
Advertisement
Ads by CJ

తమిళంలో విజయ్‌ హీరోగా మురుగదాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'కత్తి' చిత్రం తమిళనాట బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి పలువురు స్టార్స్‌ ఆసక్తి చూపినప్పటికీ అది కేవలం వార్తలకే పరిమితం అయింది. అటు రీమేక్‌ కాకుండా, మరోవైపు డబ్బింగ్‌ చేయకుండా ఈ 'కత్తి'ని మనవాళ్లు తుప్పుపట్టించారు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి సర్వం సిద్దం అవుతోంది. ఈ చిత్రంలో విజయ్‌పాత్రను అక్షయ్‌కుమార్‌ పోషిస్తున్నాడు. కానీ ఈ చిత్రాన్ని మురుగదాస్‌ డైరెక్ట్‌ చేయడం లేదు. ఆయన ఈ చిత్రాన్ని లైకా సంస్థతో కలిసి నిర్మిస్తుండగా, మురుగదాస్‌ శిష్యుడు జగన్‌ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి మురుగదాస్‌ డైరెక్ట్‌ చేయకపోవడానికి కారణం ఆయన త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో మహేష్‌బాబుతో సినిమా చేయాల్సివుండడమే దీనికి అసలు కారణం అంటున్నారు. గతంలో మురుగదాస్‌ బాలీవుడ్‌లో తీసిన 'గజనీ, తుపాకి' చిత్రాలు బాలీవుడ్‌లో మంచి విజయం సాదించాయి. కాగా 'కత్తి' లాంటి చిత్రాన్ని ఇటు మెగాస్టార్‌ చిరంజీవి, ఎన్టీఆర్‌ చేస్తాం.. చూద్దాం.. అంటున్న సమయంలోనే అక్షయ్‌ ఈ చిత్రాన్ని చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ