తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుండి యంగ్ హీరో ధనుష్ వరకు అందరితో కలిసి నటించిన స్టార్ హీరోయిన్ నయనతార. అయితే ఆమె ఇప్పటివరకు చియాన్ విక్రమ్ సరసన మాత్రం నటించలేదు. ఆయనతో చేయడం తన గోల్ అని కూడా ఆమె అనేకసార్లు ప్రస్తావించింది. ఎట్టకేలకు ఆమెకు విక్రమ్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ కాంబినేషన్ ఇన్నాళ్లకు సెటిల్ అయింది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'పత్తు ఎండ్రదుకుళ్లు' డిజాస్టర్‌గా నిలవడంతో ప్రస్తుతం విక్రమ్ 'అరిమనంబి' దర్శకడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'మర్మ మనిదన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్‌గా నటించమని మొదట కాజల్ అగర్వాల్‌ను అడిగారట. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌లోకి నయనతార ఎంటర్ అయిందని తెలుస్తోంది. త్వరలో ఈచిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.