Advertisementt

బాలయ్య 100 కి ఆ మాత్రం వుండాల్సిందే!

Wed 25th Nov 2015 06:59 PM
balakrishna,100th movie,god father,boyapati srinu,balakrishna birthday,balayya 100th movie details  బాలయ్య 100 కి ఆ మాత్రం వుండాల్సిందే!
బాలయ్య 100 కి ఆ మాత్రం వుండాల్సిందే!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ తన 99వ చిత్రంగా ప్రస్తుతం శ్రీవాస్‌ డైరెక్షన్‌లో 'డిక్టేటర్‌' చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్ర ఆడియోను డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో విడుదలకానుంది. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇప్పుడు బాలయ్య నటించే 100వ చిత్రంపై వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరి నోట విన్నా బాలయ్య చేయబోయే 100వ చిత్రంపైనే మాట్లాడుతున్నారు. పనిలో పనిగా ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా వార్తలు వస్తున్నాయి. బాలయ్య నటించే 100వ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాతగా వారాహిచలన చిత్రం పతాకంపై రూపొందనుందని, ఈ చిత్రానికి 'గాడ్‌ఫాదర్‌' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'సింహా, లెజెండ్‌' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడో సినిమాగా అంటే హ్యాట్రిక్‌ చిత్రంగా ఈ చిత్రం రూపొందనుంది.  ఈ చిత్రాన్ని బాలకృష్ణ జన్మదినోత్సవం కానుకగా జూన్‌10, 2016న లాంఛనంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటసింహం 100 వ చిత్రానికి ఏ హైప్ కావాలో అవన్నీ ఉండేలా ఓపెనింగ్ ని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ