Advertisementt

కుమారి దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు..!

Wed 25th Nov 2015 07:49 PM
raj tarun remuneration,one crore rupees,kumari 21f,hatrick hits  కుమారి దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు..!
కుమారి దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు..!
Advertisement
Ads by CJ

'కుమారి 21ఎఫ్‌' హిట్టయితే పారితోషికం పెంచుతానని యువహీరో రాజ్‌తరుణ్‌ ఓపెన్‌గానే చెప్పేశాడు. ఆయన కోరుకున్న విదంగానే ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్లు కుమ్మరించుకుంటోంది. తొలి మూడురోజులు అన్నిచోట్ల హౌస్‌ఫుల్స్‌. చాలాచోట్ల బ్రేక్‌ ఈవన్‌ వచ్చేసింది కూడా. సోమవారం నుండి వచ్చేదంతా ఇక లాభమే. రూపాయికి ఒకటిన్నర రూపాయి మిగలబోతోందని ట్రేడ్‌ వర్గాలు కూడా ఈ చిత్రానికి సర్టిఫికేట్‌ ఇచ్చేశాయి. సో.. హీరోగా రాజ్‌తరుణ్‌ హ్యాట్రిక్‌ కొట్టేసినట్లే. ఈ హిట్లను క్యాష్‌ చేసుకొంటున్నాడు రాజ్‌తరుణ్‌. 'కుమారి 21ఎఫ్‌' తర్వాత పారితోషికం పెంచుకోవాలని ఆయన ప్లాన్‌ వర్కౌట్‌ అయింది. ఇప్పటివరకు 30 నుండి 50లక్షల వరకు తీసుకుంటున్న ఈ హీరో రాబోయే చిత్రాలకు కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను మంది నిర్మాతలు వున్నారు. వారికి తన పారితోషికంగా కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అని అందరినీ పిలిచి చెప్పేశాడట. ఎంతైనా అదృష్టం అంటే రాజ్‌తరుణ్‌దే. చిటికెలో కోటి స్టార్‌ అయిపోయాడు అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ