తెలుగు సొంతంగా నేర్చేసుకొని సొంత గొంతుతో డబ్బింగ్‌లు చెప్పేందుకు ఆరాటపడుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఆమె తన సొంతగొంతుతో డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతోంది. డిసెంబర్‌లో ఈ చిత్రం డబ్బింగ్ వర్క్ మొదలుకానుంది. డబ్బింగ్ ప్రారంభం అయ్యాక కొన్ని సీన్స్‌కి రకుల్ ప్రీత్‌సింగ్ చేత డబ్బింగ్ చెప్పించి పూర్తిగా ఆమె గొంతు సెట్ అవుతుందని భావిస్తే ఆమెతోనే డబ్బింగ్ చెప్పించడానికి దర్శకనిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రం టీం ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్‌కు వెళ్లనున్నారు. ఆమె గొంతు డబ్బింగ్‌కు సెట్ అవుతుందో లేక ఆమె ఆశలపై నీళ్లు చల్లుతుందో చూడాలి...! మొత్తానికి ఏళ్లకు ఏళ్లుగా టాలీవుడ్‌ను ఏలి తెలుగు మాత్రం సరిగ్గా నేర్చుకోకుండా కేవలం డబ్బింగ్ మీదనే ఆధారపడి, అరువు గొంతులపై ఆధారపడే హీరోయిన్ల కంటే రకుల్‌ప్రీత్‌సింగ్ ఎంతో బెటర్ అని చెప్పాలి.