తనతో పాటు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు తెరమరుగవుతున్నారు. కొందరు కేవలం వయసు మళ్లిన హీరోలకే పరిమితం అయ్యారు. కానీ నయనతార మాత్రం కోలీవుడ్‌లో వయసు వచ్చేకొద్ది ఇమేజ్‌ను భారీగా పెంచుకుంటోంది. సీనియర్ స్టార్స్ సరసనే కాకుండా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న కుర్రహీరోలకు కూడా ఆమె మెయిన్ ఛాయిస్‌గా మారింది. ఆమె నటిస్తే చాలు,.. సినిమా సూపర్‌హిట్టు అనే నిర్ణయానికి చాలామంది హీరోలు, దర్శకనిర్మాతలు వచ్చేశారు. తాజాగా ఆమెకు లేడీ ఓరియంటెడ్ చిత్రాల అవకాశాలు కూడా ఏరికోరి వరిస్తున్నాయి. కెరీర్ మొదట్లో పలు ప్రేమాయణాలతో వార్తల్లో నిలిచినప్పటికీ ఆమె క్రేజ్‌కు డిమాండ్ తగ్గలేదు. ఆమె కెరీర్‌పై అవి ప్రభావం చూపలేదు. కానీ ఆమెతో ప్రేమాయణాలు నడిపిన వారు మాత్రం కనుమరుగు అవుతున్నారు. ఓ హీరోయిన్‌కు ఇంతకంటే ఏమి కావాలి? కాగా ఇటీవల ఆమె నటించిన 'తని ఒరువన్, మాయా, నానుమ్‌రౌడీధాన్' చిత్రాలతో ఆమె హ్యాట్రిక్ హిట్లు కొట్టడంతో ఆమె ఇమేజ్‌తో పాటు పారితోషికం కూడా రెండూ మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి మూడు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తోంది. దీంతో చిన్న దర్శకనిర్మాతలు, హీరోలు ఆమెను కాకుండా వేరే వారిని చూసుకుంటూ ఉంటే ఆమె అడిగినంత ఇచ్చి భారీ బడ్జెట్ చిత్రాల దర్శకనిర్మాతలు, హీరోలు ఆమెతోనే కమిట్ అవుతున్నారు. కాగా చాలామంది కోలీవుడ్ స్టార్స్ మాత్రం నయన ఒప్పుకుంటేనే డేట్స్ ఇస్తామని ఖరాఖండీ చెబుతున్నారట. మరి ఈమె హవా ఎంత కాలం కొనసాగుతుందో వేచిచూడాల్సి ఉంది.