ఒక్క సినిమాతో జాతకాలు మారిపోవడం ఒక్క సినిమా ఫీల్డ్‌లోనే జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు అదృష్ట దేవత హేబా పటేల్ తలుపు తట్టింది. అలాంటి సినిమా ఆమెకు పడింది. 'కుమారి 21ఎఫ్' రూపంలో ఆమెను అదృష్ట దేవత పలకరించింది. 'అలా ఎలా' సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా హేబా పటేల్ ఎలాంటి గుర్తింపును తీసుకురాలేకపోయింది. అసలు ఆమెను గుర్తించిన వారే లేరు. సడన్‌గా 'కుమారి 21ఎఫ్'లోకి ఎంటర్ అయింది. సుకుమార్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ భామపై చిత్రసీమ ఫోకస్ పెట్టింది. సినిమా విడుదలయ్యాక రాజ్‌తరుణ్ కంటే హేబా పటేల్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. బోల్డ్ సీన్స్‌లో భలే నటించింది అనే పేరు వచ్చింది. గ్లామర్ ఆరబోతలో ఏ మాత్రం మొహమాట పడలేదు. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు హేబా పటేల్ ను సంప్రదిస్తున్నాయట. ఆల్రెడీ ఆమె రెండు సినిమాలకు సైన్ చేసిందని సమాచారం. అందులో ఒకటి ఓ అగ్రహీరో మూవీ ఉందని అంటున్నారు. మొత్తానికి 'కుమారి 21ఎఫ్' తో ఈ కుమారి జాతకం మారిపోయి.. తంతె బూరెల గంపలో పడింది.