Advertisementt

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో!

Sat 28th Nov 2015 05:22 PM
vaishnav tej,sai dharam tej brother,mega family new hero  మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో!
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో!
Advertisement
Ads by CJ

ఉన్న హీరోలు సరిపోరన్నట్లుగా మెగా ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో దిగబోతున్నాడట. చిరంజీవి తరువాత నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరం తేజ, వరుణ్ తేజతో చాంతాడంత లిస్టు కనపడుతున్నా మెగా కుటుంబలో పుడితేనే చాలు హీరో అన్నట్లుగా ఇప్పుడు సాయి ధరం తేజ తమ్ముడు వైష్ణవ తేజను హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పూరి జగన్నాథ్ కానీ వీవీ వినాయక్ కానీ వైష్ణవ తేజ సినిమాకు దర్శకుడిగా పని చేసే అవకాశాలు ఉన్నాయట. నిజానికి చెల్లెళ్ళు, అక్కలు, బావలు, మేనల్లుల్లు అంటే చిరు, పవన్, నాగబాబులకు ఎనలేని ప్రేమాభిమానాలు. అందుకే సాయి ధరం తేజ రేయ్ సినిమాకు ఫ్యామిలీ మొత్తం దిగొచ్చింది. సాయి ఎలాగు మంచి నటుడిగా పరిణతి చేద్నుతున్నాడు కాబట్టి అతని భవిష్యత్తుకు డోఖా లెదు. ఇక వైష్ణవను కూడా నిలబెట్టేస్తే చిరంజీవి పూర్తిగా రిటైర్ అయిపోవచ్చు అన్నది ఆలోచన. సందులో సడేమియాలాగా నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ వేషాల బాట పట్టింది. సూడబోతే యాడబోయినా మెగా లొల్లే ఎదురయేటట్టుంది సంగతి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ