Advertisementt

బాహుబలిని ఫాలో అవుతున్నారు!

Sat 28th Nov 2015 07:25 PM
bajirao mastani,bahubali,sanjay leela bhansali  బాహుబలిని ఫాలో అవుతున్నారు!
బాహుబలిని ఫాలో అవుతున్నారు!
Advertisement
Ads by CJ

ఓ దక్షినాది సినిమా ఉత్తరాదిలో ఎక్కువగా చూసే హిందీ బాషలోకి డబ్ అయ్యి అక్కడ బాక్సాఫీస్ వద్ద స్వైర విహారం చేసి సూపర్ స్టార్ హీరోల రికార్డులు తుత్తునియలు చేసిందంటే, అది కేవలం రాజమౌళి, ప్రభాస్, బాహుబలికే సాధ్యం అయింది. కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవిలు సైతం ముంబైలో అడుగుపెట్టినా ఇంతటి ఘన విజయాన్ని ఎప్పుడూ అందుకోలేదు. అందుకే తెలుగోడి గౌరవాన్ని యావత్ ప్రపంచంలో నిలబెట్టిన సినిమాగా బాహుబలి చిరస్థాయిలో నిలిచిపోతుంది. బాహుబలికి పూర్తి భిన్నంగా ఇప్పుడు బాజీరావు మస్తాని రాబోతుంది. మరాటా సామ్రాజ్యంలో పీష్వాలలో మేటివాడైన బాజీరావు పెళ్లి, ప్రేమ మరియు ఇతర చారిత్రక అంశాల నేపథ్యంలో రాబోతున్న ఈ హిందీ చిత్రం దక్షిణ భారతంలో ప్రముఖ సినిమా మార్కెట్టు కలిగిన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. నిర్మాత, దర్శకుడు సంజయ్ లీల భన్సాలికి ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి మీద గట్టి నమ్మకం ఉండడం, బాహుబలి అండ్ రుద్రమదేవి లాంటి చారిత్రక, జానపద చిత్రాలకు కాసుల వర్షం కురవడంతో తన ఎపిక్ లవ్ డ్రామాను మన ముంగిట మన భాషలలో డిసెంబర్ 18న నిలబెట్టబోతున్నాడు. బాజీరావు కూడా బాహుబలి లాంటి ఫలితాన్ని అందుకోవాలని కోరుకుందాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ