'బ్రూస్ లీ' కు ముందు కోన వెంకట్, శ్రీను వైట్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. బ్రూస్ లీ కోసం రామ్ చరణ్ స్వయంగా వాళ్ళిద్దరిని కలిపాడు. కాని ఆ చిత్రం రామ్ చరణ్ కు నిరాశనే మిగిల్చింది. దానికి కారణం శ్రీనువైట్లే అని కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. రీసెంట్ గా 'శంకరాభరణం' చిత్రం కోసం కోన వెంకట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బ్రూస్ లీ' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. తను చెప్పిన విధంగా 'బ్రూస్' లీ సినిమా తీసి ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేదని తన అభిప్రాయం వెల్లడించాడు. తను 72 సీన్లు రాశిస్తే శ్రీను వైట్ల ఆ సీన్స్ వాడకుండా సొంత సీన్లను ఉపయోగించడం వలనే ఇలాంటి రిజల్ట్ వచ్చింది లేదంటే 'బ్రూస్ లీ' రీసౌండ్ వేరేగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా తన సీన్లు పెట్టకుండా కథ రచయితగా స్క్రీన్ పై తన పేరు వేయడంతో బాధ పడ్డాడని చెప్పుకొచ్చాడు. మరి నిజంగా కోన రాసిన సీన్లు వాడుంటే గనుక సినిమా హిట్టయ్యేదేమో..?