Advertisementt

దేవిశ్రీప్రసాద్ రాంగ్ డెసిషన్!

Mon 30th Nov 2015 10:26 AM
devisri prasad,kumari 21f success meet,hero chances,dil raju,sukumar  దేవిశ్రీప్రసాద్ రాంగ్ డెసిషన్!
దేవిశ్రీప్రసాద్ రాంగ్ డెసిషన్!
Advertisement
Ads by CJ

సంగీత దర్శకుడిగా అందరికి సుపరిచితుడైన దేవిశ్రీప్రసాద్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడియో స్టేజీపై దేవి హుషారు, స్టెప్స్, సింగింగ్ వేడుకకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. అయితే దేవికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వున్న క్రేజ్‌ను చూసి అందరూ అతడ్ని హీరోగా పరిచయం చేస్తామని ముందుకు వచ్చారు. అయితే ఇన్నాళ్లు ఆ ఆఫర్‌లను సున్నితంగా తిరస్కరించిన దేవి ఇప్పుడు దాదాపుగా హీరోగా పరిచయం కావడం ఖరారైనట్లే.. ఇటీవల జరిగిన కుమారి 21ఎఫ్ సక్సెస్‌మీట్‌లో దేవిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు దిల్ రాజు. అయితే ఈ ప్రకటన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవీ హీరోగా పరిచయం కావడం కరెక్టేనని కొందరు అంటుంటే.. కొంత మంది రాంగ్  డెసిషన్ అంటున్నారు. సంగీత దర్శకుడిగా ఉన్నతస్థానంలో వున్న దేవిశ్రీప్రసాద్ రిస్క్ చేస్తున్నాడని... దేవికి హీరోగా కంటే సంగీత దర్శకుడిగానే ఎక్కువ క్రేజ్ వుంటుందని.. ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోతే అతని కెరీర్ ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం వుంటుందని అతని శ్రేయాభిలాషులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ