Advertisementt

మెగా యూనిట్‌లో 'మెరుపు' మిస్సయ్యింది!

Mon 30th Nov 2015 02:41 PM
ram charan,merupu title,bruce lee,vijay,teri,puli,vijay merupu movie  మెగా యూనిట్‌లో 'మెరుపు' మిస్సయ్యింది!
మెగా యూనిట్‌లో 'మెరుపు' మిస్సయ్యింది!
Advertisement
Ads by CJ

మెగా యూనిట్‌కి నిజంగానే మెరుపు మిస్సయ్యింది. మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి చేసిన 'బ్రూస్‌లీ' చిత్రం పరాజయం చెందడంతో నిజంగానే మెగా యూనిట్‌లో మెరుపు పోయింది. మెగా హీరోలు సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ల చిత్రాలకు పాజిటివ్‌ టాక్‌లు వచ్చినా..అవి మాటలకే కానీ మెరుపు వరకు వెళ్ళలేదు. చిరు చాలా కాలం తర్వాత నటించిన 'బ్రూస్‌లీ' హిట్టయ్యి ఉంటే మెగా యూనిట్‌లో మెరుపు మాములుగా ఉండేది కాదు. సరే అవన్నీ ప్రక్కన పెడితే.. అప్పుడెప్పుడో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ధరణి దర్శకత్వంలో ముహుర్తం జరుపుకున్న 'మెరుపు' టైటిల్‌ కూడా ఇప్పుడు మెగా యూనిట్‌కి మిస్సయింది. ఈ టైటిల్‌ ఎనౌన్స్‌ చేసినప్పుడు మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవ్‌. కానీ ఆ మూవీ అనూహ్యంగా ఆగిపోయింది. ఆ తర్వాత చరణ్‌ చేసిన 'జంజీర్‌'కి కూడా తెలుగులో 'మెరుపు' టైటిల్‌ పెడదామని..చివరికి 'తుఫాన్‌'ని ఫిక్సయ్యారు. ఆ తర్వాత ఏదో ఒక మెగా హీరో ఈ 'మెరుపు' టైటిల్‌తో సినిమా చేస్తారని మెగా ఫ్యాన్స్‌ భావించారు. కానీ ఇప్పుడు అది తమిళ హీరో విజయ్‌ వశం అయ్యింది. ఇటీవల 'పులి' ఫ్లాప్‌తో ఉన్న విజయ్‌..ప్రస్తుతం చేస్తున్న మూవీ 'తేరి'ను తెలుగులో 'మెరుపు'గా రిలీజ్‌ చేసేందుకు ఫ్లాన్‌ చేస్తున్నారు. ఈ మెరుపుతో విజయ్‌ ఏం మెరుపు చేస్తాడో..తెలియదు కానీ.. మెరుపు మిస్‌ అయినందుకు మాత్రం మెగా ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ