Advertisementt

రాజ్ తరుణ్ నో ఎంట్రీ బోర్డ్!

Tue 01st Dec 2015 03:59 PM
raj tharun,kumari 21 f,raj tharun remuneration  రాజ్ తరుణ్ నో ఎంట్రీ బోర్డ్!
రాజ్ తరుణ్ నో ఎంట్రీ బోర్డ్!
Advertisement
Ads by CJ

కుర్ర హీరో రాజ్ తరుణ్ ఊపు మీదున్నాడు. ఆరంగేట్రంతోనే వరుసగా మూడు హిట్లు కొట్టేసి నేటి తరం హీరోల్లో ఎవరూ సాధించలేని ఫీటును సాధించాడు. అందుకే మొదటి సినిమా పారితోషికానికి, రెండో దానికి, మూడో దానికి తరువాత రాబోయే వాటికి అసలు పొంతన లేకుండా పోయింది. లేటెస్టుగా కుమారి 21 ఎఫ్  మూవీ ఫుల్ రన్లో ఇరవై కోట్ల క్లబ్బులో చేరే అవకాశాలు మెండుగా ఉండడంతో, అందరం ముందుగా అనుకున్నట్లుగానే రాజ్ తరుణ్ అకస్మాత్తుగా తన రెమ్యునరేషన్ కోటికి పెంచేసాడు. ముప్పై లక్షలకు మించి ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకొని ఓ హీరో ఇప్పుడు కోటి రూపాయలు డిమాండ్ చేస్తుండడంతో అతనితో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్న నిర్మాతలందరూ ఆగే-పీచే అవుతున్నట్టు తెలుస్తోంది. కుమారికి ముందు సంతకం చేసిన సినిమాలకు సైతం రాజ్ ఈ రేట్లు వర్తింప చేయడంతో ప్రొడక్షన్ సగంలో ఉన్న నిర్మాతలు ఇదేం ఫిట్టింగ్ బాబోయ్ అంటూ లబోదిబోమంటున్నారట. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టె ప్రతి పైసా గ్యారంటీగా కలెక్షన్స్ రూపంలో డబల్ రాబడిగా వస్తుందని నమ్మిన ప్రొడ్యుసర్లకు మాత్రమే కుర్రోడు ఎంట్రీ బోర్డు పెట్టాడు. మిగతా వాళ్లకి నో ఎంట్రీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ