నూతన సంవత్సర వేడుకల్లో సినీ తారలకు ఎంత డిమాండ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగే వేడుకలకు గాను కోట్లు చెల్లించి మరీ వారితో ఆటపాట ఏర్పాటు చేస్తుంటారు. పలు ఈమెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు స్టార్ హీరోయిన్లను ముందస్తుగానే బుక్ చేసుకుంటాయి. యుఎస్‌ఏకు చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ నార్త్ కరోలినాలో జరిగే డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో తమన్నాతో డాన్సింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.ప్రస్తుతం తమన్నా పేరుతోనే టిక్కెట్లను అమ్ముతున్నారు. ఒక్కో టికెట్ 89 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తున్నారు. కపుల్ విత్ కిడ్ అయితే 169 డాలర్లుగా రేటు నిర్ణయించారు. మొత్తానికి తమన్నా ఇంకో నెల వ్యవధి ఉండగానే తన స్లాట్‌ను బుక్ చేసుకొని అందరి కన్నా రేసులో ముందుంది.