Advertisementt

అల్లరోడి ఆశ నెరవేరుతుందా..!

Wed 02nd Dec 2015 05:38 PM
allari naresh,mohan babu,mama manchu alludu kanchu,ramyakrishna,meena  అల్లరోడి ఆశ నెరవేరుతుందా..!
అల్లరోడి ఆశ నెరవేరుతుందా..!
Advertisement
Ads by CJ

కలెక్షన్‌కింగ్‌ ప్లస్‌ కామెడికింగ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ ఎంతో ప్రామిసింగ్‌గా ఉంది. వరుస ఫ్లాప్‌ చిత్రాల తర్వాత అల్లరి నరేష్‌ నటిస్తున్న ఈ 50వ చిత్రంపై అల్లరోడు భారీ ఆశలే పెట్టుకొని ఉన్నాడు. కాగా ఈ చిత్రంలో కామెడీకింగ్‌ అల్లరి నరేష్‌కు తోడుగా మామ మంచు మోహన్‌బాబు కూడా తనదైన శైలిలో కామెడీ డైలాగ్స్‌తో అందరిని ఆకట్టుకుంటాడని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ కూడా ఈ విషయాన్ని నిజం చేసేట్టే కనిపిస్తోంది. టిపికల్‌ కామెడీ టైమింగ్‌తో ఇందులో మోహన్‌బాబు రెచ్చిపోయాడనేది ఇండస్ట్రీ టాక్‌. తన చిత్రాలన్నీ పాత చింతకాయపచ్చడిలాంటి కథలతో బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొడుతూ ఉండటంతో అల్లరోడు మంచు మోహన్‌బాబుపై నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. గతంలో 'అల్లరిమొగుడు' కాంబినేషన్‌ అయిన మోహన్‌బాబు, రమ్యకృష్ణ, మీనాల కలయికలో వస్తున్న చిత్రం కావడం. గతంలో తనకు 'బొమ్మన బ్రదర్స్‌...చందన సిస్టర్స్‌' వంటి ఓ మోస్తరు విజయాన్ని అందించి, కామెడీని పండించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం... ఈ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ రావడంలో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ