'బ్రూస్‌లీ' డిజాస్టర్‌తో రామ్‌చరణ్ రిలాక్స్ కావడానికి వెకేషన్స్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడి నుండి రాగానే తమిళ 'తని ఒరువన్' చిత్రం రీమేక్ ప్రారంభిస్తాడు. ఈ చిత్రంపై రామ్‌చరణ్ భారీ ఆశలే పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం కాస్టింగ్ ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌తో కలిసి అల్లుఅరవింద్ నిర్మించనున్నాడని సమాచారం. రామ్‌చరణ్‌తో 'బ్రూస్‌లీ' చిత్రం తీసి భారీ రేట్లకు అమ్మి, నిర్మాతగా లాభాలు వెనకేసుకున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం పదిపైసలు కూడా ఇచ్చేది లేదని దానయ్య మొండికేశాడట. ఇక డైరెక్టర్ శ్రీనువైట్ల కేవలం 50లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు దానయ్య అంటే మండిపడుతున్నారు. దీంతో దానయ్యను ఈ ప్రాజెక్ట్ నుండి దూరంగా ఉంచడం మేలని మెగాప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ ఎంతో చాకచక్యంగా ఆ స్థానంలోకి వచ్చి చేరాడని అంటున్నారు. ఇప్పుడు మేనల్లుడి సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు అల్లుఅరవింద్. కాగా ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎందరినో పరిశీలించినప్పటికీ సెట్ కాకపోవడంతో తమిళంలో ఈ పాత్రను చేసిన అరవింద్‌స్వామినే తెలుగులో కూడా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రంలో హీరో కంటే విలన్‌కు మంచి ప్రాముఖ్యత ఉండటం, మరోవైపు హీరోయిన్‌గా అదరగొట్టిన నయనతార స్దానంలోకి ఎవరిని తీసుకుంటారు? అనే అంశాలపై అందరి దృష్టి ఉంది.