Advertisementt

మహేష్‌ సినిమా డేట్‌ మారింది..!

Thu 03rd Dec 2015 10:29 AM
mahehs babu,brahmothsawam,srikanth addala,rajinikanth,kabali movie  మహేష్‌ సినిమా డేట్‌ మారింది..!
మహేష్‌ సినిమా డేట్‌ మారింది..!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు హీరోగా సమంత, కాజల్‌, ప్రణీతలు హీరోయిన్లుగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'బ్రహ్మూెత్సవం'. కాగా ఈచిత్రాన్ని మొదట ఏప్రిల్‌ 8న విడుదల చేయాలని భావించి డేట్‌ లాక్‌ చేశారు. కానీ సోలోగా రావాలనే ఐడియాలో ఉన్న మహేష్‌కు రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' చిత్రం ఏప్రిల్‌ 10న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుందటంతో తను తెలుగుతో పాటు తొలిసారిగా నటిస్తున్న తమిళ చిత్రం కావడంతో మహేష్‌ తన సినిమా విడుదలను ఏప్రిల్‌ 29కి వాయిదా వేసుకున్నాడని సమాచారం. ఈమేరకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్‌ ఈచిత్రానికి సహ నిర్మాత కావడం, ఇంతకాలం తన డబ్బింగ్‌ చిత్రాలతోనే తమిళులకు పరిచయమైన మహేష్‌ ఈసారి మాత్రం తొలిసారిగా తమిళంంలోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడం, మహేష్‌ సరసన తొలిసారిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం... ఇలా ఈ చిత్రానికి ఎన్నో విశేషాలు ఉండటం అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ