Advertisementt

కొత్తదనానికే ఓటేస్తున్న మాస్‌మహారాజా..!

Thu 03rd Dec 2015 06:43 PM
raviteja,balupu,srinuvaitla,boyapati srinu,venusriram,evado okadu  కొత్తదనానికే ఓటేస్తున్న మాస్‌మహారాజా..!
కొత్తదనానికే ఓటేస్తున్న మాస్‌మహారాజా..!
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా రవితేజ కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటాడు. శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, హరీష్‌శంకర్‌, గోపీచంద్‌ మలినేని, బాబి.. వీళ్లంతా రవితేజ సినిమాలతో దర్శకులైన వారే. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్‌ కొనసాగిస్తున్నాడు రవితేజ. 'బలుపు' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసిన చక్రి అనే కొత్త దర్శకుడికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం త్వరలోనే కొబ్బరికాయ కొట్టుకోనుంది. ప్రస్తుతం రవితేజ 'ఎవడో ఒకడు' సినిమా సెట్స్‌పై ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు వేణుశ్రీరామ్‌. ఈయన కూడా తన మొదటి చిత్రంతో అపజయాన్ని రుచిచూపిన యువతరం దర్శకుడే కావడం విశేషం. కాగా 'ఎవడో ఒకడు' సినిమాతో పాటు చక్రి సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలనే ఆలోచనలో మాస్‌మహారాజ్‌ ఉన్నడని టాక్‌. నిర్మాత, హీరోయిన్‌ తదితర విషయాలు త్వరలో తెలియనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ