సినీ రంగం లో ఎందరో నటీనటులు ఒక అందమైన జీవితాన్ని ఊహించుకొని సినీ కళల ప్రపంచం లోనికి అడుగుపెడతారు. కానీ వారి కళ వెనుక ఎంతటి విషాదం దాగి ఉంటుందో, ఎందుచేత యవ్వన దశలోనే ప్రాణాలు బలిచేసుకుంటున్నారో మాత్రం ఎవరికీ తెలియదు. ఈ రంగుల లోకం ఎంతటి విషాదాన్ని తలిపిస్తుందో తెలిపేదే దీనాస్ ఫిలిమ్స్ వారి చిత్రం 'సితార'. నూతన దర్శకుడు సురేంద్ర జి ఎల్. దర్శకత్వం అందించిన సితార నేడు (4న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన మొదటి షో కే పలువురి ప్రసంశలు అందుకుంది ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యరు. ఈ నేపథ్యంలో..
చిత్ర దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి డెబ్యు చిత్రం. ఒక హీరోయిన్ నేపథ్య కథాంశం తో తెరకెక్కించిన చిత్రం సితార. ఈ చిత్రం చూసిన ప్రతిఒక్కరూ నన్ను అభినందించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం లో కథ, స్క్రీన్ ప్లే ను అందరూ అభినందించడం ఇంకా ఆనందాన్ని ఇస్తోంది. నన్ను, నా సినిమా ను ఆదరించిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నమ్మి, సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సహాయ సహకారాలు అందించిన నా నిర్మాత రవికుమార్ డి ఎస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలని, మరియు ఈ చిత్ర యూనిట్ కు నా ధన్యవాదాలు'' అని తెలిపారు.
నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ.. ''ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉంటాము ఐతే మనసు కలచివేసే చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇలాంటి కోవకు చెందినదే మా సితార చిత్రం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మమ్మల్ని అభినందించడం గర్వంగా నూ, సంతోషం గానూ ఉంది. ముఖ్యంగా ఈ చిత్ర కథ మరియు స్క్రీన్ ప్లే అందరినీ ఆకర్షిస్తోంది. ఒక మంచి సినిమా ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు'' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్ ల తో పాటు ఈ చిత్ర యూనిట్ కూడా పాల్గొని వారి ఆనందాన్ని పంచుకున్నారు.
రవి బాబు, రవళి కౌర్, సుమన్, అశ్విన్, పరచూరి గోపాల కృష్ణ, చిత్రం శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : బళ్ళారి రఘు, ఎడిటింగ్: నందమూరి హరి, మ్యూజిక్: ఘంటాడి కృష్ణ, రామ్ పైడి శెట్టి, నిర్మాత: రవికుమార్ డిస్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేంద్ర జి.ఎల్.