రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రం ఘనవిజయం సాదించి ఎన్నో భాషల్లో కీర్తిపతాక ఎగురవేసింది. కాగా 'బాహుబలి' తర్వాత విడుదలవుతున్న పలు చిత్రాలను 'బాహుబలి'తో పోల్చిచూడటంతో ఆయా చిత్రాలు ఆ స్థాయి లేకపోయేసరికి డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. తమిళంలో 130కోట్లతో వచ్చిన విజయ్-చింబుదేవన్‌ల 'పులి' దీనికి మంచి ఉదాహరణ. ఈ చిత్రాన్ని 'బాహబలి'తో కంపేర్ చేయడంతో ఆ అంచనాలు అందుకోలేకపోయిన ఈ చిత్రం ఘోరపరాజయం పాలైంది. కాగా త్వరలో విడుదలకు సిద్దమవుతున్న బాలీవుడ్ మూవీ 'బాజీరావ్ మస్తాని' చిత్రం కూడా ఇప్పుడు 'బాహుబలి'తో పోలికలు కలుపుకుంటోంది. దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్‌తో పాటు ట్రైలర్ కూడా 'బాహుబలి'లోని విజువల్స్‌ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. 'బాహుబలి'కి హైలైట్‌గా నిలిచిన వార్ ఎపిసోడ్స్ సైతం 'బాజీరావ్ మస్తానీ' ట్రైలర్‌లో 'బాహుబలి'ని పోలివుండటం స్పష్టంగా గమనించవచ్చు. మరి 'బాహుబలి'తో పోల్చుకోవడం వల్ల అవసరమైన హైప్ రావడం సాధ్యమే అయినప్పటికీ ఏమాత్రం ఆ పోలికకు తగ్గట్లుగా చిత్రాలు ఉండకపోతే భారీ డిజాస్టర్స్‌గా నిలిచే ప్రమాదం ఉంది.