ఇప్పటికే కోట్ల కొద్ది పారితోషికాలు తీసుకునే హీరోలు, దర్శకులు ముష్టి అన్నట్లుగా అయిదు, పది లక్షలు చెన్నై వరద భాధితులకు విరాళాలు ఇస్తుంటే ఒళ్ళు కంపరం ఎక్కిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా అందరినీ ఏకి పారేసాడు. తమిళనాడు మొత్తాన్ని వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో మన తోటివారికి సహాయం చేయాలన్న ఆలోచన మంచిదే, అందుకు మన నటీనటులను, సాంకేతిక నిపుణులు ముందుకు వచ్చినందుకు థాంక్స్ చెప్పాలి. మరి ఈ దాతృత్వంలో సైతం లారెన్స్ రాఘవ లాంటి వాళ్ళను ఏమనాలి. వర్సటైల్ ఆర్టిస్టు, కొరియోగ్రాఫర్ అండ్ డైరక్టరుగా పేరు గడించిన లారెన్స్ ఈసారి తన గొప్ప మనసును కూడా చాటుకున్నాడు. చెన్నయ్ ప్రజల బాధలను దగ్గరగా చూసాడు కాబట్టి వరద బాధితులకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.