Advertisementt

యంగ్‌స్టార్స్‌తో పోటీపడుతోన్న నటసింహం..!

Sun 06th Dec 2015 10:10 AM
balakrishna,lion,dictator movie,40 crores business  యంగ్‌స్టార్స్‌తో పోటీపడుతోన్న నటసింహం..!
యంగ్‌స్టార్స్‌తో పోటీపడుతోన్న నటసింహం..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి ఒకప్పుడు టాలీవుడ్‌ని శాసించిన నలుగురు స్టార్‌హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌. అయితే చాలాకాలం కిందటే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. తాజాగా ఆయన రీఎంట్రీ ఇస్తేగానీ ఆయనకున్న క్రేజ్‌ తగ్గిందా? పెరిగిందా? లేక అదే స్థాయిలో ఉందా? అనేది తేలదు. తాజాగా ఆయన 'బ్రూస్‌లీ' చిత్రంతో గెస్ట్‌రోల్‌లో కనిపించినప్పటికీ సినిమా ఫ్లాప్‌ అయింది. కాబట్టి ఆయన రేంజ్‌ ప్రస్తుతం ఏంది? అనేది తెలియాలంటే ఆయన ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ హీరోగా రీఎంట్రీ ఇస్తేగానీ తేలదు. ఇక నాగార్జున, వెంకటేష్‌ వంటి స్టార్స్‌ సోలో హీరోలుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. వీరు సోలోగా చేసిన చిత్రాలు కూడా 20 నుండి 25కోట్లలోపే బిజినెస్‌ ఉందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం కీలకమైన సమయాల్లో సూపర్‌హిట్స్‌ కొడుతూ, ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళుతున్నాడు. తనతోటి హీరోల నుంచి దూరం జరిగి యంగ్‌స్టార్స్‌కు పోటీ ఇస్తున్నాడు. ముఖ్యంగా బాలయ్య చిత్రాలకు జరిగే బిజినెస్‌ ఇండస్ట్రీలో ఉన్న కుర్రస్టార్స్‌కు దగ్గర దగ్గరగానే ఉంటోంది. ఆయనతోటి హీరోలు 25 కోట్ల దగ్గరే ఆగిపోతుంటే బాలయ్య మాత్రం ఈజీగా 40కోట్ల దాకా వచ్చేస్తున్నాడు. 'లయన్‌' వంటి డిజాస్టర్‌ తర్వాత కూడా ఆయన తాజాగా నటిస్తున్న 'డిక్టేటర్‌' బిజినెస్‌ ఆ విషయాన్ని ప్రూవ్‌ చేస్తోందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా 40కోట్ల మేర బిజినెస్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుటి స్టార్స్‌తో పోటీపడుతున్న బాలయ్య తన బిజినెస్‌ స్టామినాను 50కోట్ల క్లబ్‌లో చేర్చాలని ఆరాటపడుతున్నాడట. తన 100వ చిత్రంతో ఆయన బిజినెస్‌ 50కోట్లకు చేరే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ